నిన్న మొన్నటి వరకూ కస్సుబుస్సులాడుకున్న తెలంగాణ సీఎం, గవర్నర్‌ ఇప్పుడు ఆత్మీయులైపోయారు. సచివాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న కొనియాడారు. సచివాలయాన్ని గవర్నర్ తమిళిసై తొలిసారి సందర్శించారు. ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ను తోడ్కొని సచివాలయం చూపించారు. తమిళిసైకి సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూపించారు.


ఒక్కో అంతస్తు గురించి కేసీఆర్‌ వివరించారు. తర్వాత గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్లి, శాలువాతో సత్కరించి పూల బొకే ఇచ్చారు. అంతే కాదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కుంకుమ బొట్టుతో గవర్నర్ తమిళిసైని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు కూడా. అనంతరం గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు  ఇష్టాగోష్టిగా ఇద్దరూ చర్చించారు. సచివాలయ సందర్శన పూర్తయిన తర్వాత గవర్నర్ తమిళిసైకి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీడ్కోలు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr