తెలంగాణలో కర్ణాటక సర్కారు ఎన్నికల ప్రచారం వివాదాస్పదం అవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో తాము ఫలానా పథకాలు అమలు చేస్తున్నామంటూ తెలంగాణలోని పత్రికల్లో  ప్రకటనలు ఇస్తోంది. దీంతో కర్నాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ.. కర్నాటక సీఎస్ కు లేఖ రాసింది. ఇలాంటి ప్రకటనల జారీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అని ఈసీ అంటోంది.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఇక నుంచి తెలంగాణ ప్రాంతంలోని పేపర్లలోని ఎన్నికల ప్రకటనలు ఆపివేయాలని ఈసీ ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని ఈసీ తాఖీదులిచ్చింది. అయితే ఇప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. ఇక ఏం జరిగినా తాకీదులు, వివరణలు మాత్రమే మిగులుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: