పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పలువురు కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా గెలవబోతోంది ఎగ్జిట్‌ పోల్స్ చెప్పినందువల్ల రేవంత్ రెడ్డి నివాసం వద్ద నేతల సందడి నెలకొంది. రేవంత్ రెడ్డిని పోటీ చేసిన అభ్యర్థులు కలుస్తున్నారు. ఇప్పటి వరకూ కలిసిన వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏ చంద్రశేఖర్, మల్రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్ మరి కొందరు అభ్యర్థులు ఉన్నారు. వారు తమ తమ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి కూడా కలిశారు.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారం  చేపట్టబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి కి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: