ఇవాళ తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అలాగే మరో మూడు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. రాజస్థాన్‌లో 1862 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలుతుంది. నవంబర్‌ 25న రాజస్థాన్‌ ఎన్నికలు నిర్వహించగా 75.45శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. రాజస్థాన్‌లో 199 స్థానాలకు గతనెల 25న ఎన్నికల నిర్వహించారు. కరణ్‌పుర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ మృతితో 199 స్థానాలకే పోలింగ్‌ నిర్వహించారు. రాజస్థాన్‌లో మెుత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో అధికారంలో ఉంది.


ఇక మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో  నవంబర్‌ 17న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో మెుత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 76.22 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో బీజేపీ అధికారంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: