తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు టీఎన్జీవో సంఘం అభినందనలు తెలుపుతూనే కొన్ని కోరికలు తమ ముందు ఉంచారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, మంత్రివర్యులందరికీ... పది లక్షల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్సోర్షింగ్ ఉద్యోగుల కుటుంబాల తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు... తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని యావత్.. తెలంగాణ ఎన్జీవోల సంఘం పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలను తమ మానిఫెస్టోలో చేర్చినందున... ఉద్యోగుల సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు.


ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవ చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షులు ముజీబ్, కేంద్ర సంఘ నేతలు, కొండల్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, ఉమాదేవి, శైలజ, పర్వతాలు తదితరులు సీఎం రేవంత్‌కు అభినందనలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: