ఒక్క వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కోసం జగన్ సర్కారు 140 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిందా.. అంటే అవునంటున్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే రూ.680 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు ఉందని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. 

ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు... వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్ నిలదీస్తున్నారు. 89 మంది వరకూ సలహాదారులను నియమించడం, వారి అర్హతలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సలహదారుల నియామకం విషయంలో చివరకు గౌరవ హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: