కొంత మంది మొబైల్ నెంబర్‌ను మారుస్తూ ఉంటారు. లేదంటే మొబైల్ నెంబర్ పోగొట్టుకొని ఉండొచ్చు. ఇలాంటి వారు మళ్లీ కచ్చితంగా ఆధార్ కార్డుతో కొత్త మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు నెంబర్‌తో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవడం చాలా సులువు.. ఒక అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని భావిస్తే రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే యూఐడీఏఐ ఇప్పుడు కొత్త పీవీసీ ఆధార్ కార్డులను జారీ చేస్తోంది... ఇలా చేస్తే వాడుతున్న మొబైల్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం అవుతుంది..