భారత మార్కెట్లో రంగంలో దూసుకుపోతున్న రియల్ మీ ఈ నెల 20న జరగనున్న లాంచ్ ఈవెంట్ లో రియల్ మీ ఎక్స్2 ప్రోను లాంచ్ చేయనున్న సంగతి అందరికి తెలిసిందే కదా . అయితే ఇదే ఈవెంట్లో ఈ ఫోన్ తో పాటు రియల్ మీ 5ఎస్ అనే  మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను కూడా భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇక ప్రముఖమైన ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ తన వెబ్ సైట్ లో ఉంచిన ప్రత్యేక పేజీ ద్వారా ఈ విషయం ప్రపంచానికి తెలియచేయడం జరిగింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అదే పేజీ ద్వారా తెలియచేసింది. ఈ పోస్టర్ లో ఫోన్ వెనకవైపు డైమండ్ తరహా డిజైన్, నాలుగు కెమెరాలు ఉన్న సంగతి  బాగా అర్థం అవుతుంది అందరికి.


ఇక ఫ్లిప్ కార్ట్ లో ఈ పేజీకి  ‘ఫ్లిప్ కార్ట్  యూనిక్యూ’ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ ఫోన్ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ మీ ఈ మధ్య లాంచ్ చేస్తున్ ఫోన్ల తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను ఇవ్వ బోతుంది. ఈ విషయం కూడా ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ ద్వారానే తెలియచేయడం జరిగింది. 


ఫోన్ లో రియల్ మీ కొత్త కలర్ వేరియంట్ ను వినియోగదారుల ముందుకు తీసుకొని రాబోతుంది. ఇక 91  మొబైల్స్   నివేదిక ప్రకారం, దీని ధర రూ.8,999గా నిర్ణయించారు. ఇదే నిజమైతే.. 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించే మొబైల్ ఫోన్లలో ఇదే అత్యంత తక్కువ అయినా మొబైల్ అవుతుంది.  ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రియల్ మీ ఒక్క సంవత్సరంలోనే 401 శాతం పెరుగుదలలో ముందు ఉంది అని తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. షావోమి తన అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది అని నిపుణులు పేర్కొన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: