దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త విద్యుత్తు కారును భారత మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది.  ఈ ఎలక్ట్రానిక్ కారును  ఈ నెల 17ను మార్కెట్లోకి  విడుదలకు సిద్ధంగా ఉంది యాజమాన్యం. టాటా నెక్సన్ పేరిట రానున్న ఈ కారు విద్యుత్తు కారు సంస్థ నుంచి భారత్‌కు వస్తోన్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని అందరికి తెలిసిందే కదా. ఈ నెల మార్కెట్లోకి  చేస్తున్నపటికీ.. వచ్చే సంవత్సరంలోనే ఈ కారును   మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలియచేయడం జరిగింది టాటా మోటార్స్.

 

 ఇక  టాటా మోటార్స్  సంస్థ నుంచి వస్తున్న తొలి విద్యుత్తు వాహనం ఇది కాకపోయినప్పటికి.. టాటాకు మాత్రమే ప్రత్యేకించిన తాజా జిప్ట్రాన్ ఎలక్ట్రానిక్ పవర్ ట్రైన్ టెక్నాలజీతో వస్తున్న తొలి ఎస్‌యూవీ మాత్రం నెక్సనే అని కంపెనీ ముందుగానే మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది.

 

ఇక  కారు ప్రత్యేకతల విషయానికి వస్తే.... లిక్విడ్ కూల్డ్ ఐపీ 67 సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీని  ఈ కారులో ఉపయోగించడం జరిగినది. వాటర్ డస్ట్ రెసిస్టెంట్ అయిన ఈ బ్యాటరీకి కంపెనీ ఎనిమిదేళ్ల వారెంటీ కూడా ఇస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిమీ ప్రయాణిస్తుంది. దీనిలో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏసీ మోటార్  ఉపయోగించడం జరిగినది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థతో వస్తన్న ఈ మోటార్ డ్రైవ్ చేస్తున్న సమయంలో బ్యాటరీని ఛార్జ్ చేయడం జరుగుతుంది. 

 

ఇప్పటికే  టాటా నెక్సన్ విద్యుత్తు కారును పరీక్షల్లో భాగంగా  అనేక సార్లు భారత రోడ్లపై  పరీక్ష చేయడం కూడా జరిగినది. అయితే, కొత్త డిజైన్ మాత్రం బయటకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగినది. పాత నెక్సన్ డిజైన్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కారునే  పరీక్ష చేయడం జరిగింది. సరికొత్తగా  కారు ముందు భాగం కూడా ఉండనుందని కంపెనీ తెలియచేయడం జరిగింది. ఇక అసలు విషయమైన ధర రూ.15 లక్షల నుంచి 17 లక్షల ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కంపెనీ వారు. వచ్చే సంవత్సరం త్రైమాసికంలో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు ఇప్పటికే మొదలు కూడా పెట్టింది అని అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: