బంగారం ధర భగ్గుమంటుంది. మార్కెట్‌లో బంగారం ధర గరిష్టస్థాయికి చేరుకుంది. ఎంత భారతీయులకు బంగారం అంటే ఇష్టం ఉంటే మాత్రం అలా ధరలు పెరిగిపోతాయా? కొంచమైనా బంగారం ధరలు తగ్గద్దు. బంగారం ధరలు భారీ అంటే అతి భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గేది 30 రూపాయిలు 40 రూపాయిలు అయితే. పెరిగేది మాత్రం వేలు వేలు.. మొన్న ఓసారి వెయ్యి రూపాయిలు పెరిగింది.. ఇప్పుడు ఏకంగా 15వందలు పెరిగి షాక్ ఇచ్చింది. 

 

ఇలా అయితే సామాన్యులు బంగారం ఎలా కొంటారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోతున్నాయి. ఇకపోతే బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,520 రూపాయిల పెరుగుదలతో 45,310 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,390 రూపాయిల పెరుగుదలతో 41,530 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అలాగే పరుగులు పెట్టింది. దీంతో నేడు కేజీ వెండి ధర 1,330 రూపాయిల పెరుగుదలతో 50,030 రూపాయిలకు చేరింది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలోను బంగారం ధరలు కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: