పుర్రెకో బుద్ది అని పెద్దలు అన్నారు. అలాగే కొందరు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటివి కూడా చేయవచ్చా అని అనిపించక మానదు వాళ్ళు చేసే పని చుసిన తర్వాత. వాళ్ళు కూడా అంతకు మించి చేయడానికి లేక అలాంటివి చేస్తుండటం పరిస్థితి. అయినా ఎవడో వచ్చి ఏదో చెప్పగానే ఏ తీవ్రవాదిగానో మారడం కంటే, కనీసం ఇలా బ్రతకటం కూడా కాస్త నయమే. కష్టంగా ఉన్నప్పుడు పక్కన చేరి ఓదార్చినట్టు నాటకాలు ఆడి, తీవ్రవాదులతో కలిపేసుకుని ముఠాలు తిరుగుతున్న ఈ లోకంలో ఎలా బ్రతికినా సబబే. అది దేశాన్ని దెబ్బతిసేదో, మరో దేశాన్ని ఇబ్బంది పెట్టేదో అయితే మానుకోవాలి కానీ, సొంత పనులు చేసుకోవడం చాలా వరకు మేలు అని చెప్పాలి. ఒక గీత గీసి దానిని చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గిస్తే సరి అని పెద్దలు చిన్న చమత్కారం చేస్తారు చూడండి, అలా ఇది కూడా మేలేనేమో!

ఆమెకు ఎయిర్ హోస్టెస్ గా మంచి ఉద్యోగం ఉంది, నెలకు చక్కగా రెండు లక్షల జీతం వస్తుంది. జాస్మిన్ పింక్ అనే 26 ఏళ్ళ అమ్మాయి, 12 గంటల ఉద్యోగం. విసిగిపోయినట్టుగా ఉంది, నెట్ లో సోఫియా గ్రే అనే సైట్ లో చేరింది. ఆ సైట్ లో వాడేసిన లో దుస్తులు అమ్మకానికి పెట్టింది. దీనితో మొదటి నెలే మంచి స్పందన వచ్చి, జీతంతో పాటుగా లక్ష ఇలా సైట్ నుండి వచ్చింది. అలా సంపాదన వస్తూ ఉండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. పూర్తి సమయాన్ని కేవలం సైట్ లో దుస్తుల అమ్మకానికి కేటాయించడం మొదలు పెట్టింది. దీనితో డబ్బులే డబ్బులు, క్షణం తీరిక లేకుండా సంపాదిస్తుంది పింక్. అక్కడే ఆగకుండా మరో అడుగు ముందుకువేయాలనే ఉద్దేశ్యంతో ఇంకా అమ్మకాలు పెరిగే సైట్ కోసం వెతికింది.

దానితో కేవలం పెద్దలకు మాత్రమే(ఓన్లీ ఫర్ అడల్ట్స్) అనే సైట్ దొరకడంతో అందులో కూడా తన దుస్తులు అమ్మకానికి పెట్టింది.  సొంతగా స్కిన్ షో కంటెంట్ తయారు చేసుకుంది. దానికి కూడా బాగా స్పందన ఉండటంతో ఆ సైట్ లో కూడా ఎక్కువ అమ్మకాలు నమోదు చేసుకుంది. దీనితో లో దుస్తులతో పాటుగా, సాక్సులు, బట్టలు కూడా అమ్మకానికి పెట్టింది. ఇక ధరల విషయానికి వస్తే, లో దుస్తుల ధర 60 డాలర్లు(4500రూ.), బ్రా ధర 80 డాలర్లు(6000రూ.) గా నిర్ణయించింది. రానురాను అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. ఇలా విచిత్ర వ్యాపారాలు చేసేవారు పాశ్చాత్య దేశాలలో చాలా మందే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: