కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు వ్యవహరించకపోవడం వలన ఆ బ్యాంక్ పై తన పట్టును పెంచుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రిజర్వ్ బ్యాంకు చట్టం - 1934 లోని సెక్షన్ 7 ను ఉపయోగించింది. ఇలా చేయడంతో బ్యాంక్ యొక్క స్వతంత్ర హరించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం పెరిగింది. ఇంతకీ సెక్షన్ 7 అంటే ఏమిటో , వాటి అధికారాలు గురించి కింద చదవండి.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్
ఇండియా ను 1926లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రాయల్ కమిషన్ ఆన్
ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు. దీని కోసం 1934లో చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్
బ్యాంక్ చట్టం - 1934 ప్రకారం ఆర్.బి.ఐ ఏర్పాటు అయ్యింది.

1.ఈ చట్టం లోని సెక్షన్ 7 కింద
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు నిర్దిష్ట మైన ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.
2. సెక్షన్ 7 (1) ప్రకారం
కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాలు కోసం అవసరమైతే ఆర్బీఐ
గవర్నర్ తో చర్చలు జరిపిన అనంతరం , ఎప్పటికప్పుడు ఆర్బీఐ కి ఆదేశాలు జారీ చేయవచ్చు.
3. సెక్షన్ 7(2) ప్రకారం ఆర్బీఐ ని
గవర్నర్ లేకుండా తన
కేంద్ర బోర్డు డైరెక్టర్ల ద్వారా నడిపించేందుకు సైతం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
4. ఆర్బీఐ చట్టం లోని ఈ సెక్షన్ ద్వారా ప్రభుత్వం అటు
గవర్నర్ ను కానీ , డిప్యూటీ
గవర్నర్ ను కానీ ఎటువంటి సంజాయిషీ లేకుండానే తొలగించడానికి అధికారం ఉంది.
కేంద్రం ఈ సెక్షన్ ను ప్రయోగించి ఆర్బీఐ మీద పట్టు సాధించడమే కాకుండా
బ్యాంక్ వద్ద ఉన్న మిగులు నిల్వలలో సగాన్ని ఆర్థిక శాఖల ఖాతాల్లోకి మళ్లించింది.