సూపర్ స్టార్ రజనీకాంత్ ,డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా కూడా జైలర్ 2 సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో కూడా జైలర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ను డిజైన్ చేసి మరి స్టార్ హీరోలను నటింపచేసేలా చేశారు. ఇప్పుడు జైలర్ 2 లో కూడా అలాంటి ప్లానే చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. జైలర్ 2 సినిమాతో ఒక ఫేమస్ హీరోయిన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తున్నాయి.


ఆమె ఎవరో కాదు మేఘన రాజ్. వాస్తవంగా కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుమయ్యింది. 2009లో అల్లరి నరేష్ నటించిన బెండ్ అప్పారావుRMP అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా ఇదే అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది మేఘన రాజ్. ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన లక్కీ చిత్రంలో కూడా నటించింది. అలా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషల్లో నటించిన మేఘన రాజ్.. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.


కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి వివాహం చేసుకున్న మేఘన, కరోనా సమయంలో జూన్ 2020లో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు. అప్పటికే మేఘన గర్భవతి కావడంతో చాలా కృంగిపోయింది. అప్పటినుంచి సినిమాలకి దూరంగానే ఉంటోంది మేఘనా .ఇప్పుడు తిరిగి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కుమారుడు ర్యాన్ పెద్దవాడు కావడంతో తిరిగి మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది మేఘన. డైరెక్టర్ నెల్సన్ ఒక కీలకమైన పాత్ర కోసం మేఘనకు ఆఫర్ ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన మేఘన ఏవిధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. గతంలో తమిళ సినిమాలో ఆఫర్లు వచ్చినా కూడా నటించలేదట మేఘనా.

మరింత సమాచారం తెలుసుకోండి: