కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డి రేట్లను సవరించడం జరిగింది. మరి ఆ బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.పంజాబ్ నేషనల్ బ్యాంక్  ఎఫ్ డీలపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంక్ నిర్ధిష్ట కాల వ్యవధితో కూడిన కొత్త రేట్లను ప్రకటించింది. సాధారణ పౌరులు, సీనియర్ ఇంకా సూపర్ సీనియర్ సిటిజన్లకు మొత్తం రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇక 444 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం, ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు వడ్డీ రేటును 6.80% నుంచి 7.25%కి అంటే 45 బీపీఎస్ పెంచింది.ఇంకా అలాగే 666 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 7.25% నుండి 7.05%కి తగ్గించింది. ఇక ఈ కొత్త రేట్లు 2023 మే 18నుంచి అమలులోకి వచ్చినట్లు పీఎన్బీ వెబ్ సెట్లో ప్రకటించింది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీ రేట్లని రూ. 2 కోట్ల వరకు పెంచింది. సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.25 శాతం ఇంకా సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.అలాగే ఈ సవరించిన వడ్డీ రేట్లు మే 12 నుంచి అమలులోకి వచ్చాయి.


ఇక బరోడా తిరంగ ప్లస్ డిపాజిట్ స్కీమ్‌గా మొత్తం 399 రోజుల కాలవ్యవధికి ప్రత్యేక డిపాజిట్‌పై బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.ఇంకా అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్  తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటుని 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇక సాధారణ పౌరులకు 2.75% నుండి 7.20%, సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 7.70% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు 390 రోజుల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటుని ఈ బ్యాంక్ 7.20% ఇస్తోంది. అలాగే సవరించిన వడ్డీ రేటు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు మే 11, 2023 నుండి అమలవుతోంది.ఇక యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది.అయితే ఈ తాజా రేట్లు 2023 మే 18నుంచి అమలులోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిపై 3.5% నుంచి 7.10% మధ్య వడ్డీ రేట్లను ఈ బ్యాంక్ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: