సాధారణంగా మనిషి ప్రాణాలకు గ్యారంటీ లేదు అని చెబుతూ ఉంటారు.. అయితే కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది.. ఇంకొన్ని ఘటనలు చూస్తుంటే ఇంకెక్కడ గ్యారెంటీ. ఇలా చేసిన తర్వాత ఇకమనిషి ప్రాణాలకు విలువ ఎక్కడ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎంతో మంది ప్రాణాపాయం బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు  కానీ కొంతమంది మాత్రం చిన్నచిన్న కారణాలకే విలువైన ప్రాణాలను తీసుకుంటు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉంటారు. ఇలా ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.ముఖ్యంగా చదువుకునే పిల్లలే నేటి రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారు అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే జీవితం వృధా అయింది అని భావిస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇక్కడ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు


 పాఠశాల చదువు అభ్యసిస్తున్న ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. సాధారణంగా పాఠశాలకు వెళ్తున్న సమయంలో అప్పుడప్పుడు బస్సు మిస్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బస్ మిస్ అయింది అనే కారణంతో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా గోర ధూమ్  మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే  ఇటీవలే పాఠశాల కు బయల్దేరాడు. అయితే అతను వెళ్లేసరికి బస్సు వెళ్ళిపోయింది. దీంతో సదరు విద్యార్థిఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: