సాధారణంగా వర్షాకాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉంటారు . ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ విషపూరితమైన పాములు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇక వర్షాకాలంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఒక వ్యక్తిని పాము కాటు వేయటం ఇక అతను కోలుకోవడం  లేదా చనిపోవడం లాంటి ఘటనలు ఇప్పటి వరకు చూశాము. కానీ ఇక్కడ మాత్రం రెండు పాములు పగ బట్టి నట్లు గా వ్యవహరించాయి. ఏకంగా ఒకేసారి రెండు పాములు కాటు వేసిన అరుదైన ఘటన జరిగింది.


 ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. బాలిక విషయంలో విధి వింత ఆట ఆడింది. ఒకేసారి రెండు పాములు కాటేసిన విద్యార్థి చివరికి ప్రాణాలు కోల్పోయింది. నంద్యాల జిల్లా నందవరం మండలం నది కైరవాడి గ్రామం యానంలో ఉండే చాకలి నాగరాజు, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మల్లేశ్వరి మంత్రాలయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యనభ్యసిస్తుంది. అయితే ఇటీవల రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో పడుకున్న మల్లేశ్వరిని  రాత్రి 11 గంటల సమయంలో రెండు పాములు కాటు వేశాయి.


 అయితే సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో చేతి మీద కాలిపైన ఏదో కరిచింది అంటూ మల్లేశ్వరి ఏడుస్తూ నిద్ర లేచింది. ఇక తండ్రి లైట్ వేసి చూడగా మల్లీశ్వరి చేతి వద్ద కాలు దగ్గర పాములు కనిపించాయి. దీంతో వెంటనే ఆ పామును చంపి ఇక మల్లేశ్వరి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించారు. ఒకేసారి రెండు పాములు కరవడంతో మల్లీశ్వరి పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే  ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో చివరికి పరిస్థితి విషమించి బాలిక ప్రాణాలు వదిలింది. దీంతో ఇక తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: