అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పుఅన్న విషయం అందరికీ తెలుసు.. మనిషిగా పుట్టిన తర్వాత కట్టుకున్న బంధానికి విలువ ఇచ్చి సక్రమం గా బ్రతకాలి అన్న విషయంపై అందరికీ అవగాహన ఉంది.  ఇక ఇంత తెలిసినా కూడా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి అని చెప్పాలి. వెరసి  ఎన్నో దారుణ మైన ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. అక్రమ సంబంధాల మాయ లో మునిగి పోయి ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగు చూస్తున్నాయ్ అని చెప్పాలి.


 ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధం కారణంగా మరో ప్రాణం బలయింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త తరచూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య దారుణంగా భర్తను హాత మార్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. తాడిపత్రికి చెందిన అబ్దుల్ భాష ఆరెళ్ల క్రితం ఆయేషా అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నాడు. లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు అబ్దుల్. అయితే ఇటీవల మద్యానికి  బానిసగా మారిపోయాడు. అంతేకాదు భార్యకు ద్రోహం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధానికి కూడా తెరలేపాడు.


 రోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య ఆయేషాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో భర్త వేధింపులతో ఆయేషా విసిగిపోయింది. ఇలాంటి భర్త తనకు అక్కర్లేదు అని భావించింది. చివరికి ఇటీవల అర్ధరాత్రి సమయంలో భర్త  నిద్రిస్తుండగా రోకలి బండతో దారుణంగా తలపై కొట్టి హతమార్చింది. సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: