కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాము అంటూ ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నాయి. తమ ప్రభుత్వం చేసిన విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం లేదు అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నాయ్. పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలి అంటూ సూచనలు చేస్తూ ఉన్నాయి. తీరా ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటూ ఉంటే మాత్రం చివరికిప్రాణాల మీదికి తెచ్చుకోవడమే అవుతుంది అని చెప్పాలి.


 ఎందుకంటే చిన్న సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినవారు చివరికి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. వెరసి  ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్య వైఖరి కారణంగా వెలుగులోకి వస్తున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అనే ఒక సామెత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు వెళ్లిన ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.



 కేరళలోని తిరువనంతపురంలో అపర్ణ అనే మహిళకు పిల్లి కరిచింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేబీస్ ఇంజక్షన్ తీసుకునేందుకు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళింది సదరు మహిళ. ఈ క్రమంలోనే వైద్యులు పిలుస్తారేమో అని అక్కడ కుర్చీలో కూర్చుంది  ఇంతలో ఆమె వైపుగా దూసుకు వచ్చిన ఒక కుక్క ఆమె కాలును కరిచింది. దీంతో మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే ఇంత జరిగిన అక్కడ వైద్యులు మాత్రం పట్టించుకోకపోవడంతో ఉరుకుల పరుగుల మీద మరో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా కేరళలో కుక్కకాటు కేసులు ఎక్కువవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: