మునగ కాయ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మునగ కాయ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మునగకాయలో టొమోటో ముక్కలు వేసి కూర వండితే చాలా బాగుంటుంది. మరి టొమోటో ములక్కాయ కూర ఎలా వండాలో చూద్దామా. !

కావలిసిన పదార్ధాలు :

మునకాయలు  – 3

టమోటో – 5

ఉల్లి పాయ – 1

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్

పచ్చి మిర్చి -2

జీలకర్ర – 1/4 టీ స్పూన్

ఆవాలు – 1/4 టీ స్పూన్

పసుపు  – 1/4 టీ స్పూన్

జీలకర్ర పొడి  – 1 టీ స్పూన్

 కొత్తిమీర  –కొద్దిగా

ధనియాల పొడి- ఒక టీ స్పూన్

ఎండు మిరప కాయలు  – 2

కరివేపాకు – కొద్దిగా

ఉప్పు – రుచికి సరిపడినంత

ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు

నీరు – సరిపడినంత

కారం -2 స్పూన్స్

తయారీ విధానం :

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో  నూనే వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపాలి. ఆ తరువాత తరిగిన  పచ్చి మిరప కాయలు, ఉల్లి పాయలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపాలి. ఇప్పుడు మునక్కాయను ముక్కలుగా కోసి కూరలో వేసి మూత పెట్టండి. మునకాయ మగ్గిన తరువాత తరిగిన టమోటాలు వేసి కొద్ది సేపు ఉడికించండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి,ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టండి.  ఒక 10 నిముషాలు అయ్యాక మూత తీసి ఒక గ్లాసు నీళ్లు పోసి కూర అంతా ఒకసారి తిప్పి మూత పెట్టేయండి. కూర చిక్క పడిన తరువాత కొత్తి మీర వేసి గార్నిష్ చేయండి. అంతే ములక్కాయ టొమోటో కర్రీ రెడీ అయిపొయింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: