భార్య , భర్తల మధ్య గొడవ లు చాలా కామన్ .. అయితే ఆ గొడవ లను సర్దుకొని మానేస్తే ఆ గొడవ లు తగ్గి పోతాయి.. అలా లేక పోతే గొడవలు ఎక్కువై కుటుంబాలు పూర్తి గా విడి పోతాయి.. ఇక్కడ కొన్ని గొడవలు విచిత్రంగా జరిగాయి. కూరలో ఉప్పు తక్కువయిందని భార్య ను చంపిన  ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.. 

 

 

 


వివరాల్లో కి వెళితే.. కోడి కూర లో కూర లో ఉప్పు తక్కువ వేసిందన్న కోపం తో ఓ వ్యక్తి కట్టు కున్న భార్య ను కిరాతకం గా చంపేసిన ఘటన కర్ణాటక లో వెలుగుచూసింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన బాలచంద్ర(28) ప్రైవేట్ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మధుర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు. ప్రస్తుతం గర్భవతి అయిన మధుర కొద్దిరోజుల క్రితం బాగేపల్లి తాలూకా హొసహుడ్యలోని పుట్టింటికి వచ్చింది.

 

 

 

లాక్‌డౌన్‌ విధించడంతో మధుర పుట్టింట్లోనే చిక్కుకుపోయింది. భార్యను చూసేందుకు బాలచంద్ర ఆదివారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చాడు. మద్యం తాగుతూ చికెన్ కర్రీ వండాలని భార్యకు చెప్పాడు. దీంతో మధుర కోడికూర వండి భర్తకు వడ్డించింది. మద్యం మత్తులో ఉన్న బాలచంద్ర కూరలో ఉప్పు తక్కువైందని భార్యతో గొడవపడ్డాడు. రాత్రి గదిలో మరోసారి ఇదే విషయమై గొడవపడిన అతడు ఆవేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు.

 


సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి  వచ్చారు.. కేసు నుంచి తప్పించుకునేందుకు తాను పడుకున్న సమయంలో మధుర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని బాలచంద్ర ఆమె కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే వారు చేళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తానికి గుట్టు రట్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: