విజయవాడ సత్యనారాయణపురంలోగల శ్రీనగర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి కూతుళ్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీ రెండో లైన్ కు చెందిన 40 ఏళ్ల జగాని రవి, తన భార్య భరణి, పదేళ్ల కుమార్తె గీతా సహస్రతో కలిసి జీవిస్తున్నాడు. వాస్తవానికి రవి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లో ఉద్యోగం మానేసి విజయవాడకు వచ్చేశాడు.

అయితే రవి భార్య భరణి కొంత కాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు డయాలసిస్ వైద్యం జరుగుతోంది. గవర్నర్ పేటలోని తన పుట్టింట్లో ఉంటూ భరణి తరచూ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటోంది. ఈ కారణంగా రవి తన కుమార్తె సహస్రతో కలిసి ఉంటున్నాడు. శనివారం ఉదయం బావమరిది మధుబాబు రవికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో ఆయన రవి ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో స్థానికుల సాయంతో బద్దలు కొట్టి మరీ లోపలకు వెళ్లాడు. బెడ్రూంలో ఉరికి వేలాడుతున్న రవి, మంచంపై నిర్జీవంగా పడి ఉన్న గీతా సహస్ర మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇక బాలిక నోటికి ప్లాస్టర్ అంటించి, రవి ముఖానికి నల్లటి వస్త్రాన్ని చుట్టి కాళ్లు చేతులు కట్టేసి మరీ ఉన్న స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. చూస్తే ఎవరైనా హత్య చేశారా? అన్న భావన కూడా కలుగుతోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కారణంగా ఉద్యోగం పోవడం, భార్య అనారోగ్యంతో బాధపడటంతోపాటు ఆర్థిక ఇబ్బందులు, పెంచిన అమ్మమ్మ మరణం వంటివి రవిలో మానసిక ఒత్తిడిని కలగజేసి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో హత్య, ఆత్మహత్య అనేది తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: