పోలీసులు కూడా పైసలకు ఆశపడి అక్రమాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. అక్రమాలను అడ్డుకోవాల్సిన వీళ్ళే అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణ కూడా లేకపోలేదు. అత్యంత ఖరీదైన తిమింగలం వాంతిని ఓ మాజీ పోలీస్ అధికారి అక్రమంగా రవాణా చేస్తుండగా తనిఖీల్లో చిక్కారు. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.


ముంబయి పోలీసులు మాజీ పోలీసుతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, లోయర్ పరేల్ నుండి రూ .7.75 కోట్ల విలువైన వేల్ వాంతి అని కూడా పిలువబడే అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ఖరీదైన పదార్థం అంబర్‌గ్రిస్. వన్య ప్రాణుల రక్షణ చట్టం 1970 ప్రకారం స్పెర్మ్ తిమింగలాలు రక్షిత జాతి కాబట్టి ఇది భారతదేశం లో అమ్మకం నిషేధించబడింది. అయినా కూడా అక్రమ దారులకు ఇలాంటివి లెక్కేలేదు. ఏదైనా దొరికితే వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి  ప్రయత్నిస్తున్నారు.


ఇద్దరు నిందితులు నిషేధిత వస్తువైన ఈ అంబర్‌గ్రిస్‌ను రూ .7.75 కోట్ల తో కొనుగోలుదారుల కు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్‌ లోని యూనిట్ 3 అధికారులకు సమాచారం అందింది.లోయర్ పరేల్‌ లోని సీతారాం మిల్స్ సమీపం లో తనిఖీలు నిర్వహించిన అధికారులు షాక్ కు గురయ్యారు. ఈ కేసు లో మొదటి నిందితుడు పైడోనీ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న పోలీసు కానిస్టేబుల్. అవినీతి ఆరోపణల పై ఆయనను 2016 లో సర్వీసు నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇలా అక్రమంగా ఏదొక వస్తువులను తరలిస్తూ డబ్బుల ను సంపాదిస్తున్నారు. నిందితులు ఇద్దరూ మహారాష్ట్ర లోని రాయ్‌గడ్ జిల్లా లోని తీర పట్టణం అలీబాగ్‌కు సమీపం లో ఉన్న గ్రామాలకు చెందినవారు. సముద్ర తీరానికి సమీపం లో అంబర్‌గ్రిస్‌ను కనుగొన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసు పై పూర్తి దర్యాప్తు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: