ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు సైబర్‌ కేటుగాళ్లు ఎలా, ఏ విధంగా చేస్తున్నారో కానీ... అన్యాయంగా ప్రజల డబ్బును కాజేస్తున్నారు. సామాన్య ప్రజలే ... కాకుండా చాలా మంది సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తున్నారు.  అయితే.. తాజాగా  ఇన్సూరెన్స్ లో పాలసీల పేరుతో 15 లక్షల మోసం వెలుగు చూసింది.  హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలి ( 80 సంవత్సరాలు ) తో ఇన్సూరెన్స్ పాలసీలు,  రివర్సల్ బోనస్ ల పేరుతో మోసం చేసారు సైబర్ కేటుగాళ్ళు. RBI, ప్రాసెసింగ్, సెబీ వివిధ చార్జీల పేరుతో 15.47 లక్షలు మోసానాకి పాల్పడ్డారు ఆ  సైబర్ కేటుగాళ్ళు. అయితే... ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  మార్చి మాసంలో ఫిర్యాదు చేశారు ఆ వృద్ధురాలు. అయితే.. వృద్ధురాలి కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మార్చి మాసం నుంచి  దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఆ సైబర్ కేటుగాళ్ళు...ఎంతో చాకచక్యంతో మోసం చేయడంతో పోలీసులకు చిక్కలేదు. కానీ చివరికి ఇవాళ ఆ  సైబర్ కేటుగాళ్ళు... పోలీసులకు పట్టుబడ్డారు.  ఢిల్లీ గజియాబాద్ కి చెందిన దేవానిష్,  రస్టజీ, ఇమ్రాన్ ఖాన్ అనే ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్‌ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. 

ఢిల్లీ నుండి పిటి వారెంట్ పై అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు మీడియాకు వెల్లండిచారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. అంతేకాదు.... సామాన్య ప్రజలు సైబర్‌ నేరగాళ్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఎవరు ఏ విధంగా... డబ్బులు కాజేస్తారో తెలీదని పేర్కొన్న పోలీసులు... మనం అప్రమత్తంగా ఉంటేనే.. ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఇక ముందు అయినా... సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు సైబర్‌ క్రైమ్‌  పోలీసులు.



మరింత సమాచారం తెలుసుకోండి: