మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం నిర్భ‌య‌, దిశ లాంటి చ‌ట్టాలు ఎన్ని వ‌చ్చినా దేశంలో మాత్రం మ‌హిళ‌లు, బాలిక‌లు, చిన్న, పెద్ద, పండు, ముస‌లి తేడా లేకుండా అఘాయిత్యాలు మాత్రం ఆగ‌డం లేదు. రోజు రోజుకు ఏదో ఒక చోట నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలుపై 25 ఏండ్ల ఓ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణమైన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర లోని  థానే జిల్లాలో చోటు చేసుకున్న‌ది.  65 ఏండ్ల  వృద్ధురాలు మానసికంగా బాధపడుతుంది.  ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అదునుగా భావించిన ఆ కామాంధుడు  ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే  థానే పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వివ‌రించారు. న‌గ‌రంలోని నౌపడలోని హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వ‌హిస్తున్నాడు.  అదే సొసైటీలోని ఓ ఇంట్లో మానసిక రుగ్మతతో బాధపడుతూ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు మాత్రం ఆమె బంధువులు  చూడటానికి వచ్చిపోతుంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు నవంబర్ 3న మంచి నీళ్లు ఇవ్వాల‌ని వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లాడు.

పాపం దూప కొన్నాడ‌ని భావించి ఆ వృద్ధురాలు ఆ కామాంధుని కోసం  నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు ఆ యువ‌కుడు త‌లుపులు ద‌గ్గ‌రికి వేశాడు.  తలుపులు వేసిన వెంట‌నే  ఆమెపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ  బ‌య‌టికి వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉంటున్న‌ది.  ఇది గమనించిన ఇరుగు పొరుగువారు ఆమె కుటుంబసభ్యులకు తెలిపారు.  ఆ త‌రువాత  వృద్ధురాలును డాక్టర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లగా అసలు విష‌యం  బయటపడింది.  కుటుంబసభ్యులు  ఈమేర‌కు సెక్యూరిటీ గార్డుపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న థానే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ దారుణానికి పాల్పడినట్టు  అంగీకరించాడని పోలీసులు వెల్ల‌డించారు. సెక్యూరిటీగార్డుపై  వివిధ సెక్ష‌న్‌ల కింద  కేసు న‌మోదు చేసి రిమాండ్ కు త‌ర‌లించిన‌ట్టు పోలీసులు వివ‌రించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: