అయితే ఇక్కడ ఒక దొంగ మాత్రం చాలా డిఫరెంట్. అతను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఈ క్రమంలోనే అతను అంత లావుగా ఉంటే దొంగతనం చేయడం కష్టమని భావించి.. ప్రొఫెషనల్ దొంగ గా మారిపోయాడు. ఏకంగా ఒక దొంగతనం చేయడానికి పది కేజీల బరువు తగ్గాడు ఆ దొంగ. సాధారణంగా ఇప్పటివరకూ సినీ సెలబ్రిటీలు ఇలా సినిమాల కోసం ఎక్సర్సైజులు చేసి జిమ్లో కష్టపడే బరువు తగ్గడం లాంటివి చూసాము. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం చోరీ చేయడానికి బరువు తగ్గడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
అయితే ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లో మోహిత్ మారడియా అనే వ్యక్తి ఇంట్లో మోతీ సింగ్ అనే వ్యక్తి పనికి చేరాడు ఇక ఇంట్లో ఎంతో నమ్మకస్తుడిగా ఉంటూనే ఇంట్లో నగదు బంగారం ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకొన్నాడు. అంతేకాదు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా గమనించాడు. అయితే ఇంటికి ఎలక్ట్రానిక్ డోర్లు ఉండడంతో కిటికీ ద్వారా లోపలికి వెళ్లడానికి సన్నబడాలి అని అనుకున్నాడు.. దీంతో ఏకంగా పది కేజీల బరువు తగ్గాడు. అయితే ఇటీవలే ఏకంగా కిటికీలోంచి లోపలికి వెళ్లి చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని దర్యాప్తు చేస్తున్నారు.