రియల్ లైఫ్ లో అలా చేస్తే పోలీసులు తాట తీస్తారు అని మాత్రం మరిచిపోతుంటారు. చివరికి పుష్ప సినిమాలో లాగానే స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కి చివరికి కటకటాల వెనక్కి వెళ్తున్నారు. పాల క్యాన్లు కింద ఒక ప్రత్యేక అర ఏర్పాటు చేసి అక్కడ ఎర్రచందనం దుంగలను పెట్టి పైన పాలను పోసి ఇక ఎవరికి తెలియకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉన్న సీన్ ఒకటి ఉంది. ఇక అచ్చం ఇలాగే మొన్నటికి మొన్న నిషేధిత గుట్కా గంజాయి ప్యాకెట్లను వ్యాన్ లో కింద ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి పైన ఆయిల్ డ్రమ్ములు పెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునే వ్యక్తి అచ్చం పుష్ప సినిమాలో పుష్ప రాజ్ మాదిరే. ఎర్రచందనం రవాణా చేస్తూ ఇటీవల పోలీసులకు చిక్కాడు. సయ్యద్ యాసీన్ అనే వ్యక్తి పుష్ప సినిమాలో లాగ కింద ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి పైన పండ్లు పెట్టాడు. కరోనా బాధితులకు పండు సరఫరా చేస్తాను.. నేను చాలా మంచి వాడిని అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.. ఈ క్రమంలోనే ఆంధ్ర కర్ణాటక చెక్ పోస్టులలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. చివరికి మహారాష్ట్ర చెక్పోస్ట్ వద్దకు వచ్చేసరికి పోలీసులు తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఏపీ నుంచి తెచ్చిన టువంటి 2.45 కోట్ల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి