వారిద్దరూ ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ దంపతుల మధ్యలో మనస్పర్థలు రావడంతో పెద్ద మనుషుల మధ్య కూర్చోని చాలా సార్లు మాట్లాడుకున్నారు. ఇక వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా సాంప్రదాయం ప్రకారం కూతురుకు ఇవ్వాల్సిన కట్నకానులను అన్ని తండ్రి అందజేశాడు. అయ్యినప్పటికీ అత్తింటికి ఆమె మధ్య వివాదాలు డబ్బులు పరిష్కారం చూపలేదు.. ఇంకా కావాలనే డిమాండ్ ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నిజమాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల ప్రవళిక కు బోర్గం(పి) గ్రామాని కి చెందిన చామాకూర మహేష్ తో ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అయితే వారిద్దరూ ప్రేమించుకున్నారు .. విష‌యం తెలిసిన ఇరు కుటుంబాల పెద్ద‌లు వీరి పెళ్లికి అంగీకారం తెలుపడంతో 2017 ఏప్రిల్ 30 న ఘ‌నంగా పెళ్లి చేశారు. కూతురికి  క‌ట్నంగా 20లక్షల రూపాయ‌లు.. బంగారు ఆభరణాలు.. లాంఛనాలు కూడా అందజేశాడు.

అయితే పెళ్ళైన మొదట్లో వాళ్ళ కాపురం సాఫిగా సాగింది. కొంతకాలం తరువాత అత్త, భర్త, మేనమామలు అదనపు కట్నం కోసం వేధింపుల‌కు పాల్ప‌డ్డారని మృతురాలి త‌ల్లి కన్నీరు పెట్టుకుంది. ఇక కూతురు కొసం తండ్రి అదనపు కట్నం కింద లక్షల్లో డబ్బులు పంపించారు.. అయినా వేధించడం మానుకొలేక పోయారని వాపోయారు.

అంతేకాదు.. అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జ‌రిగిందని. కుల పెద్ద‌లు నచ్చ జెప్పి కాపురానికి పంపిస్తూ ఉండేవారు. కాగా.. చివరికి పుట్టింటికి చేరుకున్న ప్రవళిక మ‌న‌స్తాపం చెంది సుసైడ్ నోటు రాసి ఇంట్లో కిటికి కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టు నిమితం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: