సాధారణంగా స్కూల్ పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండటం కామన్.. అయితే ఇలా స్కూల్ లో విద్యార్థుల మధ్య జరిగే చిన్నపాటి గొడవలు  ఆ తర్వాత పెద్దయ్యాక ఒక స్వీట్ మెమరీ గా  మిగిలిపోతుంటాయి.  మంచి పొజిషన్ లోకి వచ్చిన తర్వాత స్కూల్ లో డేస్ గుర్తు చేసుకుంటే ఆ గొడవలే మధుర జ్ఞాపకాలుగా మనసుకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయ్. కానీ ఇక్కడ మాత్రం స్కూల్ విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఏకంగా ఒక విద్యార్థి ప్రాణం పోయేలా చేసింది.


 విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ ఏకంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా నగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. స్థానిక సాయి కృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్ తో గదిలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి  ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇక ఈ దాడిలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.



 గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఇక ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఇక కేవలం స్పృహ కోల్పోయాడు అని అనుకున్నారు పాఠశాల సిబ్బంది. కానీ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో ఒక్కసారిగా స్కూల్ యాజమాన్యం షాక్ అయ్యింది  ఇక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కొడుకును చూసి బోరున విలపించారు.. ఇక బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: