భార్యతో గొడవ కారణంగా వేరుపడిన సదరు న్యాయవాది భార్యను ఏమీ చేయలేక చివరికి ఆ కోపాన్ని కుమారుడిపై చూపించాడు. ఈ దారుణమైన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. డాక్టర్ కాలనీకి చెందిన న్యాయవాది దేవులపల్లి సంతోష్ కుమార్ కు ఉమామహేశ్వరి తో పెళ్లి జరిగింది.. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక నాలుగేళ్ల క్రితం భార్యతో గొడవలు కారణంగా వేరు పడ్డాడు న్యాయవాది సంతోష్ కుమార్. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవల నాలుగు నెలల క్రితమే ఇద్దరు పిల్లలను కూడా తండ్రికి అప్పగించింది తల్లి. అప్పటినుంచి భార్య పైన కోపాన్ని పదేళ్ల వయసున్న కుమారుడుపై చూపించడం మొదలు పెట్టాడు.
తండ్రి చిత్రహింసలు భరించలేని బాలుడు చివరికి పారిపోయి తల్లి వద్దకు చేరుకున్నాడు. అయితే కొడుకు ఒంటి పై తీవ్ర గాయాలు ఉండడం చూసిన తల్లి మహేశ్వరి తల్లడిల్లిపోయింది. ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీసింది. ఈక్రమంలోనే ఇక తన భర్త సంతోష్ కుమార్ చిత్రహింసలకు గురి చేశాడు అనే విషయం తెలుసుకుని షాక్ అయింది. వెంటనే బాలుడిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి