నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది. ఏదో కదులుతు ఉన్నట్లుగా కనిపించడం గమనించిన స్థానికులు వెంటనే వెళ్లి ఆ కవరు ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా ప్లాస్టిక్ సంచిలో ఒక పసికందు ఉంది. ఇక ఆ పసికందు వయసు కేవలం మూడు రోజులే అని వైద్యులు భావిస్తున్నారు ప్లాస్టిక్ కవర్లో శిశువును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక వెంటనే స్థానికులు శిశువును నిలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అనారోగ్యం కారణంగానే నవజాత శిశువును తల్లిదండ్రులు చివరికి ఇలా వదిలేసుకున్నారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని వదిలేసిన తల్లిదండ్రులు జాడ కోసం సమీపంలోని ఆసుపత్రిలో నర్సింగ్ హోమ్ లో కూడా నమోదు చేసిన ఇటీవల ప్రసవాల రికార్డులను పరిశీలిస్తున్నారు పోలీసులు. పుట్టుకతోనే అంగవైకల్యంతో శిశువు పుట్టడంతో తల్లిదండ్రులు వదిలి వెళ్ళినట్లు తెలుస్తుంది. కొంతమంది వ్యక్తులు ఆటోలో వచ్చి ఆస్పత్రి వద్ద ఇక ఇలా శిశువుని వదిలేసి వెళ్లిపోయారు అని కొంతమంది స్థానికులు చెబుతూ ఉన్నారు. ఏదేమైనా నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఇలాంటి ఘటన జరగడం మాత్రం సంచలనంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి