
ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. కోడలు కిచెన్ లో వంట చేస్తూ ఉంది. అంతలో అక్కడికి వచ్చిన అత్త నువ్వు చపాతి బాగా చేస్తావా అంటూ అడిగింది. ఇక అత్త అడిగిన ప్రశ్నకు కాస్త వెటకారంగా జోడించిన కోడలు సమాధానం చెప్పింది. దీంతో చిర్రెత్తిన అత్తా కోడలు తో గొడవ పెట్టుకుంది. ఇక అంతలోనే ఇంట్లో ఉన్న సదరు యువతి భర్త వచ్చి దారుణంగా ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో చెవి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బదలాపూర్లో వెలుగులోకి వచ్చింది. తూర్పున ఉన్న షేర్ గావ్ మౌళి చౌక్ లోని భవనంలో అశ్విన్ నికుంబ్ కుటుంబం ఉంటుంది. అయితే ఇటీవలే రాత్రి అతడి భార్య కోమల్ వంటగదిలో భోజనం తయారు చేస్తుంది.
ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన అశ్విన్ తల్లి చపాతి బాగా చేస్తావా అంటూ అడిగింది. ఈ క్రమంలోనే మా అత్తగారిని దృష్టిలో పెట్టుకొని మంచిగానే తయారు చేస్తాను అంటూ కాస్త వెటకారంగా సమాధానం చెప్పింది కోడలు. ఈ సమాధానం నచ్చక అత్తా కోడలితో గొడవ పెట్టుకుంది. కొంతసేపటికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అంతా చూస్తూ ఉండిపోయిన అశ్విన్ కోపంతో ఊగిపోయాడు. కిచెన్ లోకి వచ్చి కోమల్ ఎడమ చెవి పై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె కర్ణభేరి పగిలిపోయింది. అంతటితో ఆగకుండా బెల్టుతో కూడా కొట్టాడు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించి భర్త అత్త పై ఫిర్యాదు చేయడం గమనార్హం.