సి పి ఆర్ చేస్తే ప్రాణం నిలబడుతుంది అన్న దానికి నిదర్శనంగా సికింద్రాబాద్ లోని మారేడ్పల్లి లో ఒక ఘటన జరిగింది. కరెంట్ షాక్ తో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తికి ఓ పోలీస్ అధికారి సి పి ఆర్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణం నిలబెట్టాడు. కొట్టుకోవడం ఆగిపోయిన అతని గుండె మళ్ళీ సిపిఆర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా స్పందించటం గమనార్హం. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ ఖదీర్ అనే కానిస్టేబుల్ సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ ఉంటాడు. ఇక తన కొలీగ్స్ తో కలిసి పెట్రోలింగ్ కు వెళ్ళిన సమయంలో మారేడ్పల్లి మెయిన్ రోడ్డులోని మైసమ్మ దేవాలయం వద్ద అలంకార తోరణం ఏర్పాటు చేస్తున్న సమయంలో రాకేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్ తగలడంతో కింద పడ్డాడు
దగ్గరికి వెళ్లి చూస్తే అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్ తనకు తెలిసిన సి పి ఆర్ అప్లై చేశారు. ఇక రాకేష్ ఇక బ్రతకడం అసాధ్యం అని అందరూ ఫిక్స్ అయిన సమయంలో అబ్దుల్ ఖదీర్ సిపిఆర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే రాకేశ్ లో చలనం రావడం గమనించి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సమయస్ఫూర్తి ప్రదర్శించి గుండెకు సిపిఆర్ నిర్వహించి ఏకంగా వ్యక్తి ప్రాణాలను నిలబెట్టిన కానిస్టేబుల్ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి