
అయితే ఈ వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు సడన్ హార్ట్ ఎటాక్ లు చూస్తూ చూస్తుండగానే మనిషి ప్రాణాలను సెకండ్ల వ్యవధిలో తీసేస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా సడెన్ హార్ట్ ఎటాక్‌లతో చనిపోతున్నారు. దీంతో ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది మనిషి జీవితం. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
ఏకంగా 8వ తరగతి విద్యార్థి సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సీ హాస్టల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు కోటిస్వాములు అనే 13 ఏళ్ల విద్యార్థి. ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి భోజనం చేశాక ఊపిరాడటం లేదని స్నేహితులతో చెప్పిన బాలుడు.. కాసేపటికే కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని వార్డెన్ ఆసుపత్రికి తరలించిగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడు అన్న వార్త ఆ తల్లిదండ్రులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అరణ్య రోదనగా విలపించారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.