ఇక కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి తెలిసి ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. ఇంత చిన్న కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా అనే భావన ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. భార్య తలుపు తీయలేదు అనే మనస్థాపం చెందిన భర్త చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది. చిలప్ చేయడం మండలం గంగారం గ్రామానికి చెందిన వడ్డే మల్లేశం అనే 27 ఏళ్ల యువకుడు రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు.
ఇక ఇటీవలే రాత్రి సమయంలో మరోసారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి భార్యను తలుపులు తీయాలి అంటూ కోరాడు. అయితే సరిత మాత్రం భయపడి తలుపులు తీయలేదు. దీంతో మనస్థాపం చెందిన మల్లేశం ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు చెట్టుకు వేలాడుతున్న మల్లేశంని చూసి ఒక్కసారిగా బోరున విలపించారు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి