సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకోవడం చాలా తేలికగా మారింది. అడవిలో జీవించే భయంకరమైన జంతువులు గురించి చెప్పమంటే మొదటగా వినబడే పేర్లు సింహం, పులి. మరి అలాంటి జంవుతులకు ఎలాంటి జంతువైనా వనకాల్సిందే. కుక్కలైతే ఇక చెప్పాల్సిన పనిలేదు. అరవడం తప్ప వాటిని ఏం చేయలేవు. అలాంటిది ఓ కుక్క ఓ చిరుతను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందంటే మీరు నమ్ముతారా? అవును, ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కుక్క తనపై దాడికి దిగిన చిరుతపై ప్రతి దాడికి దిగి గట్టిగా గర్జించింది. దీంతో చిరుత తోకముడిచి గబగబా పారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని రాహూరి తాలూకాలో జరగగా తాజాగా వెలుగు చూసింది. ఓ రాత్రి సమయంలో అడవి నుంచి బయట పడిన ఓ చిరుత ఓ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఇంటి ముందు కాపలాగా ఉన్న కుక్క దానిని గమనించి దాడికి దిగింది. ఆ కుక్క ప్రతిదాడి చేయడం విస్తుపోయిన చిరుత అక్కడి నుంచి ఒక్క ఉదుటున పారిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కాగా నెటిజన్లు ఆ కుక్కని ఆకాశానికెత్తేస్తున్నారు.


ఓ న్యూస్ ఛానల్ ట్విట్టర్ వేదికగా షేర్ కాబడిన ఆ వీడియో నెటిజన్లను కట్టి పడేస్తుంది. లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక కామెంట్లకైతే లెక్కేలేదు. 'విశ్వాసంలో కుక్కని మించిన మరేజీవి ఈ భూ ప్రపంచంలో ఉండదు!' అని కొంతమంది కామెంట్స్ చేస్తే, 'ఆ శునకం లేకపోతే ఆ ఇంటి యజమానులు గతి ఏమయ్యేదో?' అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అలాంటి శునకం మాకు లేదే అని తెగ బాధపడుతూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఇక్కడ వైరల్ వీడియోని చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: