ఎవరైనా కోపం వస్తే తిట్టుకుంటారు, మహా అయితే కొట్టుకుంటారు. కానీ ఒక భార్య మాత్రం కుటుంబ కలహాల కారణంగా తన భర్త నాలుకనే కొరికేసిందట. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు గత రెండు సంవత్సరాలుగా తరచుగా గొడవలు పడుతున్నారట. అయితే ఇటీవల ఈ గొడవలు ముదిరి పాకాన పడి ఆ భార్య తన భర్త నాలుకనే కొరికేసిన దారుణ పరిస్థితి ఏర్పడింది.
గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతిని 2015 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే 2 సంవత్సరాల నుండి వారి మధ్య ఘర్షణలు పెరిగి ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడం జరుగుతుంది. ఈ క్రమంలోనే జూలై 21 శుక్రవారం రోజు కూడా వారు గొడవలు పడ్డారు. అయితే ఈ గొడవలలో విసిగిపోయిన భార్య ఏకంగా భర్త నాలుకనే కొరికేసింది.
ఆ భర్తను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్ కి సిఫారసు చేశారట వైద్యులు. కానీ ఈ ఉదాంతంలో భార్య చెప్తున్న దాని ప్రకారం తనకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్న కారణంగా తాను ఆ విధంగా తన భర్త నాలికను కొరికేసింది అని తెలుస్తుంది. కోపం వస్తే నోటిలో ఉన్న నాలుకను ఎలా కొరకడం సాధ్యమైందని కొంతమంది వాపోతున్నారు. ఈమధ్య సమాజం ఎటు పోతుందో తెలియడం లేదని సామాజిక వేత్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి