సాధారణంగా నాన్న అంటే పైకి గంభీరంగా కనిపించిన పిల్లల మీద మాత్రం అమితమైన ప్రేమను కలిగి ఉంటాడు. ఇక పిల్లలకు ఏ కష్టం రాకుండా అన్ని కష్టాలన్నీ తానే భరిస్తూ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు ఆనందాన్ని పంచేందుకే.. తన జీవితం మొత్తం త్యాగం చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక కొడుకు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే ఆ తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇలా పెంచి పెద్ద చేసిన తండ్రిని ఎంతోమంది పిల్లలు ఇటీవలే కాలంలో ఒక వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోకుండా ఏకంగా అటు వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


 అయితే కొంతమంది ఇలా తల్లిదండ్రులను భారంగా భావించి అనాధాశ్రమాలలో వదిలేస్తుంటే ఇంకొంతమంది మాత్రం కని పెంచిన తల్లిదండ్రుల విషయంలో కాస్తయినా జాలీ దయ చూపించకుండా ఏకంగా ప్రాణాలు తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో మనుషుల తీరుకు అద్దం పడుతూ ఉంది. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవెలోకి చెందినదే. ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రి విషయంలో ఆ కొడుకు కాస్తయినా జాలి దయా చూపించలేకపోయాడు.


 ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు మద్యానికి బానిసై చివరికి పింఛన్ డబ్బులు కోసం దారుణంగా హత్య చేశాడు  ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో వెలుగు చూసింది. 90 ఏళ్ల మల్లయ్యకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నారు. అతని భార్య సాయమ్మ మృతి చెందింది. ఇతనికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు బుక్కయ్య రోజు వారి కూలి పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి భార్య వెళ్ళిపోయింది. దీంతో తండ్రితో కలిసి ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైనా బుక్కయ్య తండ్రి ఆసరా పింఛన్ ఇవ్వాలని గొడవపడ్డాడు. మరుసటి రోజు 100 రూపాయల కోసం గొడవకు దిగి చివరికి ఆగ్రహంతో ఊగిపోయి దారుణంగా హత్య చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: