ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే అంతా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యమైన ఘటనలు చివరికి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో అప్పుడు వరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా గడిపిన కావాల్సిన వారు నిజంగానే చనిపోయారా అని నమ్మశక్యం కాని విధంగా ఎన్నో ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే సడన్ హార్ట్ ఎటాక్ లాంటి ఘటనలు మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు మరిన్ని అనూహ్యమైన  ఘటనలు ప్రాణాలు తీస్తున్నాయ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా చాలామంది తరచూ ఎగ్ బజ్జీలను తినడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది మందులోకి మంచింగ్ లాగా బజ్జీలు తింటూ ఉంటే.. కొంతమంది సరదాగా స్నాక్స్ లాగా ఎగ్ బజ్జీలను తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎగ్ బజ్జి తినడం అనేది సర్వసాధారణమే. కానీ ఎగ్ బజ్జీ తినడం కారణంగా ప్రాణాలు పోతాయి అంటే ఎవరైనా నమ్ముతారా.. అలా ఇలా జరుగుతుంది ఇప్పటివరకు మేము కూడా ఎన్నోసార్లు ఎగ్ బజ్జీ తిన్నామూ.. కానీ మాకు ఏం కాలేదు కదా అంటారు చాలామంది.


 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఏకంగా ఇష్టంగా తిన్న ఎగ్ బజ్జి వ్యక్తి ప్రాణాలను తీసింది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని గోవింద హలికి చెందిన గొల్ల తిరుపతయ్య అనే 39 ఏళ్ల వ్యక్తి ఎగ్ బజ్జీ తింటూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బజ్జి గొంతులో ఇరుక్కుపోయింది. అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే భార్య గొంతులో ఇరుక్కున్న ఎగ్ బజ్జిని  బయటకు తీసేందుకు ప్రయత్నం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. కొద్దిసేపటికి ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చి ఎగ్ బజ్జిని గొంతులో నుంచి బయటకు తీసిన అప్పటికి ఆలస్యం జరిగిపోయింది. చివరికి ప్రాణం పోయింది. ఈ అనూహ్య ఘటనతో భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: