సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సహ్యద్రి బోస్ కొన్ని వివరాలు ఇచ్చారు. ప్రధాన మైన అంశం రోజు ఏపీ ప్రభుత్వంతో తాము ఒప్పందం చేసుకున్న డాక్యుమెంట్లలో డేట్లు లేవని ఈ మధ్యే తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. నాకు గుర్తున్నంత వరకు జూన్ చివరి తేదీన చేసినట్లు చెప్పారు.  సంతకాలు చేసిన రోజు సీఎం కార్యాలయంలో కరెంట్ పోయినట్లు మాత్రం గుర్తుకు ఉన్నట్లు చెబుతున్నారు.


సంతకాలు చేసే సమయంలో కరెంట్ పోయిన విషయం గుర్తింది. కానీ ఆ డ్యాక్యుమెంట్లలో డేట్ ఉందో లేదో గమనించలేదని చెప్పారు. అసలు చిన్న చిన్న విషయాల్లోనే కచ్చితంగా డేట్లు మెన్షన్ చేస్తారు. దాదాపు 380 కోట్ల డీలింగ్ చేసే దాంట్లో డేట్ లేకపోవడం ఏమిటని సిమెన్స్ మాజీ ఎండీని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లే తెలుస్తోందని అర్థమవుతుందని అంటున్నారు. ఇంతలా దిగజారి మాట్లాడటం దేనికని విమర్శిస్తున్నారు.


సచివాలయాల్లో కరెంట్ పోతే క్యాండిల్స్ పెట్టుకుని పనిచేస్తున్నారా? ఇంత దారుణంగా మాట్లాడటం వెనక పక్కా అవినీతి జరిగినట్లు తెలుస్తుందని ఆరోపిస్తున్నారు. సుమన్ బోస్ ను సిమెన్స్ సంస్థ ఎందుకు తొలగించింది. లేకపోతే ఆ కంపెనీ నుంచి ఈయన వెనక్కి రావడానికి గల కారణాలు ఏమిటి? 3330 కోట్ల రూపాయల ఒప్పందం పేపర్ ను సీఐడీకి చూపిస్తే సమస్యకు పరిష్కారం దొరికనట్లైతుంది కదా? ఎందుకు ఒప్పందం చేసుకున్న పత్రాలను చూపించడం లేదు.


దీనికి గల కారణాలు ఏమిటి? వరిజినల్‌  సిమెన్స్ కంపెనీ జర్మనీలో ఉంది. అవును నిజమే ఒప్పందం చేసుకున్నాం అని సిమెన్స్ కంపెనీ యాజమాన్యంతో ఒక లెటర్ ఇప్పించొచ్చు కదా? ఎందుకు ఆ పని చేయడం లేదు. సిమెన్స్ ను పక్కనబెట్టి డిజి టెక్ అనే పిల్ల కంపెనీ పేరు మధ్యలో ఎందుకు తీసుకువస్తున్నారు. ఇవన్నీ చిక్కుముడులు విప్పలేని ప్రశ్నలు.. వీటికి సమాధానాలు దొరికితే ఇక అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: