జన సేన పార్టీ ఒక్క  ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పార్టీ మాత్రమే కాదు. అది ఉభయ తెలుగు రాష్ట్రాలకూ సంబంధించిన పార్టీ. తప్పు ఎవరు చేసినా  ప్రశ్నించే నిజమే తన పార్టీ తత్వం అని  చెప్పుకొస్తుంటారు పవన్ కళ్యాణ్ .అదే నిజం అయితే  రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎవరినైనా ప్రశ్నించగలిగే విధంగా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే   విమర్శిస్తూ ఉంటారు.


కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ని మాత్రం ఇప్పటి వరకు  విమర్శించిన  సందర్భం లేనే లేదు అంటారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రభుత్వం ప్రతిపక్ష నేతను అరెస్టు చేసి అరాచకం సృష్టిస్తుందని అంటారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి గతంలో  ఇద్దరు ప్రతిపక్ష నేతలు అరెస్ట్ అయ్యారు. ఒకరు  భారతీయ జనతా పార్టీకి చెందిన బండి సంజయ్. అయితే రెండో వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి.


బండి సంజయ్ విషయంలో ఎవరో ఒక రిపోర్టర్ ఫార్వర్డ్ చేసిన పేపర్ తన ఫోన్ కి రావడంతో పేపర్ లీక్ అనే కేసు పై అరెస్టు చేయడం జరిగింది. మరి అప్పుడు బండి సంజయ్ కి ఆయన తోడుగా నిలబడ్డారా, కేసీఆర్ ని ఇది ఎక్కడ అన్యాయం అని ప్రశ్నించారా అని కొంతమంది అడుగుతున్నారు. అలాగే ఓటుకు నోటు కేసులో అప్పటి తెలుగుదేశం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి అరెస్టు అవ్వడం జరిగింది.


దీనిపై కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని ఏమీ ప్రశ్నించలేదు. మరి చంద్రబాబు  అరెస్టు సందర్భంగా ఇక్కడ స్వేచ్చ లేదంటూ  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు పవన్.  కానీ  తాను, తన ఆస్తులు ఉన్నటువంటి హైదరాబాద్ కెసిఆర్ రూలింగ్ లో ఉంది కాబట్టి అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం చేయడం లేదు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు‌ కొంత మంది.

మరింత సమాచారం తెలుసుకోండి: