
అసలు జగన్ అక్రమాస్తుల కేసులో అని ఎల్లో మీడియా వార్తలు రాయడం అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నీ ఎదిరించడం వల్లనే జగన్ జైలుకు వెళ్లాడని విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు జగన్ మాట్లాడుతూ కొట్టాం తీసుకున్నాం తమ సమయం వచ్చినప్పుడు కొడతామని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయినా టీడీపీ కార్యకర్తలు మా సమయం వచ్చినప్పుడు జగన్ కు ఉంది అని బహిరంగంగానే బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైసీపీ కార్యకర్తలను వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా జగన్ పై ఏకపక్షంగా బూతులు తిడుతున్నారు. సైకో జగన్ అంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో జరిగింది పూర్తి తప్పిదం అనే విధంగా మాట్లాడుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి నిజా నిజాలు అన్ని కోర్టు పరిధిలో ఉంటాయని తెలుసుకోకుండా కేవలం జగన్ మాత్రమే జైలుకు పంపించాడు అనే విధానంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఇదే టీడీపీ కార్యకర్తలు ఇలా ఎందుకు మాట్లాడలేరని ప్రజలు అనుకుంటున్నారు. తమ నాయకుడు అయితే వేరే వారు అయితే మరోరకంగా ఇలా రెండు విధాలుగా మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. మొత్తం మీద టీడీపీ కార్యకర్తలు చేస్తున్న విమర్శలు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు సూచిస్తున్నారు.