తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ఎక్కువగా ఆస్తి పాస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ వారు ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు చూపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు అభ్యర్థిగా రంగంలోకి దిగిన గడ్డం వివేక్ వెంకట స్వామి టాప్ లో నిలిచారు. ఆయన తన ఆస్తి 606 కోట్ల రూపాయలుగా చూపించారు. ఆయన తర్వాత మునుగోడు లో పోటీ చేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తి 452 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. అంటే ఇదంతా అఫీషియల్ గా ఉన్నట్లు తెలుస్తుంది.


అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి 432 కోట్లు, పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 225 కోట్లు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ భువనగిరి నుంచి 212 కోట్లు, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బీ ఆర్ ఎస్ అభ్యర్థి 197 కోట్లు, గడ్డం వినోద్ కాంగ్రెస్ నుంచి 197 కోట్లు, ఎమ్. రవి కుమార్ యాదవ్ బీజేపీ, శేరిలింగం పల్లి 190 కోట్లు, బండి రమేశ్ కూకట్ పల్లి 160 కోట్లు, జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నుంచి శేరిలింగంపల్లి 126 కోట్లు, దీన్ని బట్టి చూస్తే ఆస్తులు ప్రకటించిన వారిలో ఎక్కువగా కాంగ్రెస్ వారే ఉన్నారు.


ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన వారు కాకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారి ఆస్తులు ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనార్హం. మొత్తం మీద 100 కోట్లకు పైగానే ఆస్తులు చూపించిన వారు చాలా మంది నాయకులు ఉండటం చూసి తెలంగాణలోని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇక్కడి నిరుద్యోగం ఎక్కువగా ఉన్నా కానీ రాజకీయ నాయకులు మాత్రం వందల కోట్లకు అధిపతులుగానే ఉన్నారని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: