
అందులో భాగంగానే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఏ గ్రామ పాలన ఆ గ్రామంలో జరగాలని గ్రామ సచివాలయం ద్వారా పాలనను అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ కొనియాడారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రారంభించారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో కోటి 77 లక్షల అభివృద్ధి పనులకు శుక్రవారం స్పీకర్ తమ్మినేని శంకుస్థాపనలు చేశారు. కనుగులవలస గ్రామంలో సుమారు31. 75 లక్షల నిధులతో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ పాఠశాలను ఆధునికరించాటనికి, సుమారు 22 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రానికి స్పీకర్ తమ్మినేని శంకుస్థాపన చేశారు. సుమారు 76.21 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి మంచినీటి కొళాయి కార్యక్రమాలకు స్పీకర్ తమ్మినేని శంకుస్థాపనలు చేశారు.
సుమారు 40 లక్షల నిధులతో పనులు పూర్తిచేసిన గ్రామ సచివాలయ భవనాన్ని, 6.80 లక్షల నిధులతో కలుగులవలస గ్రామానికి నిరంతర విద్యుత్ కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని ప్రారంభించారు. గతంలో సొట్టవానిపేట రూరల్ ఫీడర్ నుండి విద్యుత్ సరఫరా చేసే వారని ఇప్పుడు 24 గంటలు కరెంటు ఇవ్వాలని ఉద్దేశంతో 6.80 లక్షల నిధులతో ఇండోర్ ఎస్ ఎస్ నుండి నిరంతర విద్యుత్తు సరఫరాకు ప్రారంభోత్సవం చేశామని స్పీకర్ తమ్మినేని తెలిపారు.