
ప్రస్తుతం వైసీపీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఎస్సీ మంత్రులు ఇద్దరు, జగన్ హయాంలో 5 గురు, బీసీ మంత్రులు బాబు హయాంలో 8 మంది, జగన్ హయాంలో 11 మంది, టీడీపీ తరపున బీసీల నుంచి రాజ్యసభ సభ్యులు 0, వైసీపీ తరఫున ఏకంగా నలుగురికి అవకాశం ఇచ్చారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని మొత్తం 18 మందికి ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తే వైసీపీ ఏకంగా ఈ కులాలకు సంబంధించి 30 మందికి అవకాశం కల్పించింది. అలాగే స్పీకర్ గా కోడెలకు టీడీపీ, ఇప్పుడు తమ్మినేనికి వైసీపీ అవకాశం ఇచ్చింది.
ఎప్పుడు చెప్పే మాట బీసీల పార్టీ అంటేనే టీడీపీ అని, అయితే ఇదంతా ఒకప్పటి మాట 1983 నుంచి 1996 వరకు టీడీపీకి బీసీల పార్టీ అనే పేరు ఉండేది. 99 నుంచి చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చినప్పటి నుంచి డబ్బు ప్రధానంగా పదవులు వచ్చినట్లు తెలుస్తోంది. మిగతా చోట్ల కుల ప్రాతిపదికన పదవులు అస్సలు ఇచ్చినట్లు కనిపించవు.
కానీ ప్రస్తుతం జగన్ ఆ విధంగా ఆలోచన చేసినట్లు కనిపించడం లేదు. బీసీలకు ఎక్కువగా సీట్లను ఇస్తున్నారు. టీడీపీ నుంచి ఆ వర్గం వారిని దూరం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలో జగన్ సక్సెస్ అవుతాడా కాడా అనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది. ప్రజలు గనక గతంలో బీసీలకు టీడీపీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటే టీడీపీకే ఎక్కువ అవకాశం ఉంటుంది.