ప్రధాని నరేంద్ర మోదీ నోట హైదరాబాద్ ను భాగ్యలక్ష్మీ నగరంగా పలకడం అనేది చర్చనీయాంశంగా మారింది. భాగ్యలక్ష్మీ నగరం నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వెళ్లడం అనేది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ప్రసంగంలో అన్నారు. సికింద్రాబాద్ ర్వైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని పర్యటన రెండు గంటల పాటు హైదరాబాద్ నగరంలో జరిగింది. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అందులో ముఖ్యమైనది వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం. హైదరాబాద్ నుంచి తిరుపతికి కేవలం 7 నుంచి 8 గంటల లోపు చేరుకుంటుంది. నాలుగు చోట్ల మాత్రమే ఈ రైలు ఆగుతుంది.


దాదాపు రూ.11 వేల కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధాని మోదీని కలడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పై విమర్శలు కూడా చేశారు. హైదరాబాద్ అని పిలవకుండా భాగ్యలక్ష్మీ నగరం అని పలకడంతో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి.  అమిత్ షా వచ్చిన సమయంలో కూడా భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. బండి సంజయ్ కూడా చార్మినార్ ప్రాంతంలోనే బహిరంగ సభ కూడా పెట్టారు.


హైదరాబాద్ అనగానే గతంలో చార్మినార్ ప్రసిద్ధిగా చూపించే వారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ అంటే అదే చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం ప్రసిద్దమైందని బీజేపీ గతం నుంచే చేస్తున్న ప్రచారం. దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని బీఆర్ఎస్,ఎంఐఎం నాయకులు గతంలో నే విమర్శలకు దిగారు. గతంలో రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే భాగ్యలక్ష్మీ టెంపుల్ గురించి మాట్లాడే వారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం గురించి మాట్లాడిన వారిలో చేరిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: