తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ మధ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ది చెందింది. ఆంధ్ర ఏ మాత్రం అభివృద్ధి కాలేదని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు హరీశ్ రావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కడే హరీశ్ రావుకు మద్దతుగా మాట్లాడారు. దీనితో వైసీపీ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మేధావులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.


వైసీపీ మంత్రుల చేతకాని తనం వల్లే ఇలా తయారైందని పవన్ అనడం, హరీశ్ రావు వ్యాఖ్యల్ని సమర్థించడం సరైనది కాదని అంటున్నారు. తెలంగాణలో అభివృద్ది అంతగా ఉంటే అక్కడి ప్రజలు ముంబయి, దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఎందుకు వలస పోతున్నారని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పాలన అనేది అక్కడి ప్రభుత్వంలో ఉన్న మంత్రి చెప్పడం కాదు. ప్రజలు చెబితే దాన్ని నమ్మి ఆంధ్రలో ఉన్న నాయకులను విమర్శించాలి. కానీ తెలంగాణ డెవలప్ అవుతుంది. ఆంధ్రలో కావడం లేదు. అనేది అవాస్తవం అనేది పవన్ గుర్తించాలని కోరారు.  


పవన్ కల్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పార్టీ పెట్టి ఆంధ్ర ప్రజల హక్కుల కోసం పోరాడాతానని ప్రకటించారు. అది మరిచి తెలంగాణ నాయకులను వెనక్కి వేసుకుని రావడం, ఇతర నాయకులకు వత్తాసు పలకడం ఎంత వరకు న్యాయమని పవన్ ను ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీలో ని నాయకులకు కొత్త విషయం ఏమీ కాదు. కానీ దాన్ని సరైన పద్ధతిలో తిప్పికొట్టగలగాలి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ సరైన వ్యాఖ్యలు చేసి ఉండాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: