
ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడం కూడా మింగుడు పడని విషయం. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోవడంతో చంద్రబాబు వేసిన ఎత్తుగడల ముందు జగన్ చిత్తయ్యాడని టీడీపీ వర్గాలు తెగ సంబరపడిపోయాయి.
పుండు మీద కారం చల్లినట్లు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే అసంతృప్తి రావడం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, కమ్యనిస్టులు పోటీ చేసి ఎలాగైన జగన్ ను గద్దె దించుతామని ప్రకటించడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అప్పటి వరకు వై నాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి పోవాలని నిర్ణయించుకున్న వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా అయిపోయాయి.
అయితే గత ఎన్నికల్లో టైమ్స్ నౌ సంస్థ అసెంబ్లీల వారీగా కాకుండా దేశ వ్యాప్తంగా సర్వే చేశారు. ఇందులో ప్రధానంగా వైసీపీ 22 నుంచి 23 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పింది. అది చెప్పిన విధంగానే 23 ఎంపీ స్థానాలను గెలుచుకుని వైసీపీ తన మార్కును చూపించింది. ప్రస్తుతం మళ్లీ టైమ్స్ నౌ చేసిన సర్వే లో మునుపటి కంటే కాస్త తగ్గినా దాదాపు 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని దానికంటూ ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపింది. దీంతో వైసీపీ నాయకులు మళ్లీ వైనాట్ 175 అని ప్రచారం మొదలుపెట్టేశారు.