రాజకీయాలు ఎలా ఉండకూడదు అనే దానికి ఏపీ రాజకీయాలని ఉదాహరణగా చెప్పవచ్చు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో రాజకీయాలు నెలకొన్నాయి . ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. అసలు ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అంతిమంగా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా రాజకీయ వ్యవహారాలు నడిపించాలి. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ విధంగా వ్యవహరించడం లేదని, ప్రజలు ఏమైపోతే మాకేంటి ? రాజకీయాలే మాకు ముఖ్యం అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ, ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రయత్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రాజకీయ విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లకుండా, అడుగడుగున అడ్డం పడుతూనే వస్తోంది. 

 

IHG


ఇక రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ కు సంబంధించి మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. కరోనా సాధారణ జ్వరం లాంటిదేనని, జగన్ చెబుతూ దాంతో మరి కొంతకాలం సహజీవనం చేయాల్సి ఉంటుందంటూ చెప్పారు. అయితే దీనిపై టిడిపి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇదే అంశంపై జాతీయ స్థాయిలో అనేక మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే ధ్రువీకరించింది. అయినా టిడిపి మాత్రం జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ విమర్శలు చేసింది. అంతే కాదు జగన్ బాధ్యతాయుతంగా మాట్లాడారు అంటూ అనేక విమర్శలు చేయడంతో పాటు, చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ కూడా రాశారు.

 

IHG


 అసలు జగన్ వ్యాఖ్యల్లో తప్పు ఏమైనా ఉందా అంటే... ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ వైరస్  మానవులతో కలిసి చాలాకాలం ప్రయాణం చేస్తుంది. అంతేకాకుండా కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. కొంతకాలానికి ఈ వ్యాధి ఒక అనారోగ్యంగా మారుతుంది. రోగ నిరోధక శక్తిని సాధించడం, టీకాను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతాయి. చైనా నుంచి మొదలుపెట్టి అమెరికా, జర్మనీ వంటి అగ్ర దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, నిపుణులు అందరూ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ కూడా చెప్పారు. జగన్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాద్దాంతం చేస్తూ, ప్రజల్లో అనవసర భయాలు కలిగిస్తోంది.


 గతంలో కరోనాను కంట్రోల్ చేయడానికి పారాసెట్మాల్ మాత్ర సరిపోతుందని జగన్ చెప్పిన విషయాన్ని టిడిపి ఎద్దేవా చేసింది. అయితే ఈ మాటను జగన్ ఒక్కరే చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడు దగ్గర నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ వరకు ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలను తప్పుపట్టని తెలుగుదేశం పార్టీ కేవలం అదే విషయాన్ని ప్రస్తావించగా, ఆయన పై విమర్శలు చేసింది. విమర్శలు చేయడం తప్పు కాదు కానీ, ఈ విపత్తు సమయంలో యధావిధిగా బురద చల్లే కార్యక్రమానికి పూనుకోవడం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి రాజకీయ అనుభవశాలిపై జాలి కలిగిస్తోంది. 


ఈ వైరస్ మనతోనే ఉంటుంది అని చెప్పిన జగన్ మాటలు తప్పయితే, ప్రపంచంలో అగ్ర స్థాయి సైంటిస్టులు, నిపుణులు ఇదే విషయాన్ని చెప్పారు కదా మరి వాళ్ళని తప్పు పడదామా ? ప్రజల్లో ఉన్న అపోహలను భయాలను దూరం చేయాల్సిన అవసరం బాధ్యత ఒక నాయకుడికి ఉండాలి. జగన్ అదే పని చేశారు. కానీ ఈ విషయం యధాతధంగా బురద రాజకీయాలకు పాల్పడుతూ టిడిపి అధినేత చంద్రబాబు మరింత బురద తనపై తానే చిమ్ముకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: