ఒక్కోసారి అనిపిస్తుంటుంది.. నేను కలగనడం లేదు కదా.. ఇదంతా కలే కాదు కదా.. నిజంగానే తెలంగాణ వచ్చేసిందా.. నిజంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైందా అనిపిస్తుంటుంది. ప్రత్యేక రాష్ట్రం కలసాకారమై ఆరేళ్లయినా కూడా ఒక్కోసారి ఇది నిజమేనా అనిపిస్తుందంటే.. ఎంతటి అసాధ్యం సుసాధ్యమైంది.. ఎన్నేళ్ల కల కనుల ముందు నిలిచింది...!

 

IHG

 

తెలంగాణ ఏర్పాటు ఎందుకు అసాధ్యం అనుకోవాలి.. అంటే ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లాలి. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడే నాటికే.. ఆ రెండు రాష్ట్రాలు పరస్పర విరుద్ధస్వభావాలు ఉన్న భూబాగాలు. ఒక్క భాష అన్న విషయం తప్ప అనేక విషయాల్లో భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కానీ ఒక్క భాష ఒక్క రాష్ట్రం, విశాలాంధ్ర అంటూ ఆనాటి పెద్దలు రెండు ప్రాంతాలనూ ఒక్క రాష్ట్రం చేశారు.

 

IHG

 

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలినాళ్ల నుంచే.. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆనాటి పాలకులు అటకపై పారేశారు. ఉర్దూ మీడియంలో అరకొర చదువులు చదువుకున్న తెలంగాణవాళ్లను బ్రిటీష్ చదువుల ఆంధ్రావాళ్లు డామినేట్ చేసేశారు. ఉద్యోగాల్లోకి వచ్చేశారు. ముల్కి నిబంధనలకు పాతరేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మూడు నాలుగేళ్ల నుంచే మళ్లీ ప్రత్యేక తెలంగాణ స్వరం ఊపందుకోవడం మొదలు పెట్టింది.

 

IHG

 

అలా తెలంగాణ అసంతృప్తి పెరిగి పెద్దదై.. చివరకు 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా రూపు దాల్చి.. ఏకంగా 400మంది తెలంగాణ వీరులు ప్రాణాలు కోల్పోయారు. అంత స్థాయిలో ఉద్యమమే జరిగినా అప్పటి ఢిల్లీ పెద్దలు దాన్ని ఉద్యమ నాయకులకు పదవుల ఆశ చూపి అణగదొక్కారు. ఆ తర్వాత కాలంలో తెలుగు దేశం రాకతో అసలు తెలంగాణ స్వరమే మూగబోయింది.

 

IHG

 

అలాంటి పరిస్థితుల్లో మళ్లీ 2001లో తెలంగాణవాదాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్.. తన 13 ఏళ్ల పోరాటంలో అనేక ఢక్కామొక్కీలు తిని మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధనలో ముఖ్యభూమిక పోషించాడు. తొలి తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసిన తీరు చూసిన ఎందరో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని విశ్వసించలేదు. కానీ బక్కప్రాణి కేసీఆర్.. పార్టీలకు అతీతంగా, నాయకులను పోగు చేసి.. ఏకతాటిపై నడిపి.. ఢిల్లీని గెలిచి ప్రత్యేక రాష్ట్రం సాధించాడు. తెలంగాణవాసుల అరవయ్యేళ్ల కలను సాకారం చేశాడు. తమ జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన చూడలేమేమో అనుకున్న వాళ్లెందరో ఇప్పుడు గర్వంగా జై తెలంగాణ అంటున్నారు.

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: