రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. వ్యూహాలు సైతం గాలికి కొట్టుకుపోతాయి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు విష‌యంలోనూ.. ఇలానే జ‌రిగింద‌ని అంటున్నారు ఆ పార్టీ నేత‌లు. తాజాగా పార్టీని లైన్‌లో పెట్టేందుకు సోము వీర్రాజు ప్ర‌యాస ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న నెల‌కోస‌భ పెడుతున్నారు. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా అడుగులు వేస్తున్నా.. స‌క్సెస్ అవ‌డం లేదు.

అయిన‌ప్పికీ.. సోము మాత్రం త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌ర్న‌లులో స‌భ ను నిర్వ‌హించారు. జాతీయ‌స్థాయిలో ఒక నాయ‌కుడిని ర‌ప్పించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జంట్‌, పాస్ట్ ఇష్యూల‌ను క‌లిపేసి జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ స‌భ‌ను ఫెయిల్యూర్ చేయ‌డానికి .. మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌ రంగంలోకి దిగిపోయారు. ఆయ‌న సోము వీర్రాజును భారీ ఎత్తున విమ‌ర్శించారు.

ఒక‌వైపు క‌ర్నూలులో స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు.  చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని వెల్లంపల్లి విమర్శించారు. సోము వీర్రాజు కార్పొరేటర్‌గా కూడా పనికిరాని వ్యక్తి అని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? అని సూటిగా ప్రశ్నించారు.

నిజానికి క‌ర్నూలు స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలో మంత్రి ఇలా వ్యాఖ్యానించారంటే.. ఉద్దేశం ఏంటి? స‌ద‌రు  స‌మావేశం హైలెట్ కాకుండా అడ్డుకోవ‌డ‌మే క‌దా!  ఈ విష‌యం సోము వీర్రాజు గ్ర‌హించ‌లేక పోయారు.  స‌భ మాట దేవుడెరుగు! అన్న‌ట్టుగా.. ఆయ‌న మంత్రి వెలంప‌ల్లిపై విరుచుకుప‌డ్డారు. దీంతో క‌ర్నూలు స‌భ‌కు ఫోక‌స్ లేకుండా పోయింది. పోనీ.. ఇక్క‌డ వెలంప‌ప‌ల్లిపై అయినా.. పైచేయి సాధించారా? అంటే అది కూడా లేదు. మొత్తానికి మంత్రి విసిరిన ట్రాప్‌లో సోము చిక్కుకున్నార‌ని.. సొంత పార్టీ నేత‌లే కామెంట్లు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: